హైదరాబాద్ మణికొండలో విషాదం. వేలంలో 15 లక్షలకు లడ్డూ దక్కించుకున్న సాఫ్ట్‌వేర్ శ్యామ్ ప్రసాద్ కాసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వేలంలో గణేషుడి లడ్డూను సొంతం చేసుకొని ఉత్సాహంగా ఆడిపాడాడు. ఇంటికి వెళ్లి కూర్చున్నచోటే కుప్పకూలిపోయాడు. అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.