దేశ అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. హాజీపూర్ మండలంలోని చిన్న గోపాల్ పూర్ గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీలో సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. పదేళ్ళ మోదీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్ది చెందాయని పేర్కొన్నారు.