సంక్రాంతికి ట్రైన్ టికెట్లు లేవు
NEWS Sep 16,2024 06:32 am
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు 4 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో గరీబ్‌రథ్, విశాఖ, ఫలక్‌నుమా వంటి ప్రధాన రైళ్లన్నీ రిగ్రెట్ చూపుతున్నాయి. జనవరిలో మొదలయ్యే సంక్రాంతి పండుగ ప్రయాణానికి సెప్టెంబరు నెల నుంచే లక్షల మంది ప్రయత్నించారు.