ఐఎఫ్టీయూపై ఆరోపణలు శోచనీయం
NEWS Sep 16,2024 06:24 am
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి గత 25 ఏళ్లుగా అనేక ఉద్యమాలు, సమ్మెలు చేసిన ఐఎఫ్టీయూపై యాజమాన్య అనుకూల సంఘం నాయకులు ఆరోపణలు చేయడం శోచనీయమని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ విమర్శించారు. 18 రోజుల సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు ద్రోహం చేసింది ఎవరో కార్మిక వర్గానికి తెలుసన్నారు.