రాయికోడ్ లోని ముదిరాజ్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టంచిన వినాయకుని లడ్డు వేలంలో లక్ష రూపాయలకు లడ్డును యూసుఫ్ పూర్ యాదుల్ దక్కించుకున్నారు. రాయికోడ్ గ్రామ చరిత్రలో అత్యధిక ధర అని తెలిపారు. 2వ లడ్డును గువ్వ నాగేష్ రూ. 20 వేలకు దక్కించుకున్నారు. తర్యాత గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఘనంగా నిర్వహించారు.