తెలంగాణతల్లి విగ్రహం పెట్టాల్సిన చోట
రాహుల్ తండ్రిది పెడతారా?: కేటీఆర్
NEWS Sep 16,2024 05:54 am
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెడతారా? అని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరదీస్తారా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.