నస్పూర్ లోని మంచిర్యాల సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.