ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన
ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్సై
NEWS Sep 16,2024 05:55 am
తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్సై కిరణ్ కుమార్ సూచించారు. శోభాయాత్ర సందర్భంగా సాంప్రదాయ సాంస్కృతిక పద్ధతిలో భజన సంకీర్తన ఆటపాటలతో, నృత్యాలు చేసుకుంటూ సాగాలని, యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు.