కార్మికుల అనుమతి లేకుండా
రికవరీ చేయవద్దు
NEWS Sep 16,2024 05:56 am
కార్మికుల అనుమతి లేకుండా వేతనాల్లో నుంచి ఎలాంటి రికవరీ చేయవద్దని హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, కార్యదర్శి అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏరియాలోని ఐకే 1ఏ, ఐకే ఓసి గనుల్లో వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేయడానికి సిఎస్ఆర్ నిధుల నుండి సహాయం అందించాలని కోరారు.