డుంబ్రిగుడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం ప్రకృతి అందాలు అద్భుతమని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ దంపతులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వారు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేసి సందడి చేశారు. చాపరాయి అందాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు పేర్కొన్నారు.