మందుబాబులకు అడ్డాగా రైతువేదిక
NEWS Sep 16,2024 06:20 am
వెల్గటూర్ మండలం చెగ్యాంలోని రైతువేదిక మందుబాబులు,ఆకతాయిలకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో పోలీసుల గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే ప్రాంతంలో యువకులు అర్ధరాత్రి వరకు, మద్యం, గంజాయి తాగుతున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు, పోలీసులు ఆకతాయిల చర్యలను అరికట్టాలని కోరుతున్నారు.