ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భాద్రపాద మాసం శుద్ధ త్రయోదశి సోమవారం సందర్భంగా నరసింహుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేకువజామునే క్షేత్రానికి వచ్చిన భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధాలయాలను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.