గణేష్ లడ్డువేలం రూ. 6,55,000
NEWS Sep 16,2024 05:51 am
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గణేష్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా తెల్లాపూర్ మై హోమ్ అంకుర్ లో నిత్య పూజలు అందుకున్న గణనాథుడి లడ్డు వేలం పాట ఆదివారం నిర్వహించారు. వేలంలో పాల్గొన్న నల్లపురెడ్డి గణేష్ రెడ్డి రూ.6,55,000 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు వారిని సన్మానించి లడ్డును అందజేశారు.