జోగిపేట పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు చేసిన గణనాథుడు నవరాత్రులు పూజలందుకొని ఆదివారం నిమజ్జనానికి బయలుదేరాడు. ఈ కార్యక్రమంలో లడ్డు వేలం పాట జరిగింది. లడ్డుని వేలం పాటలో కోవూరి ఐశ్వర్య 55 వేల రూపాయలకి దక్కించుకుంది. లడ్డును అందుకున్న ఆనందంలో గణపయ్య లడ్డు తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. గణపయ్య దీవెనలతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.