నిమజ్జనం స్పెషల్.. లేజర్ లైట్ షో!
NEWS Sep 16,2024 06:08 am
రాయికల్ పట్టణంలోని కేశవనగర్ కేశవ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా 9 రోజులు విశేష పూజలు నిర్వహించి భక్తిపాటలతో, దాండియా ఆటలతో యువకులు, మహిళలు, యువతులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన లేజర్ లైట్ల షోను చూడడానికి పట్టణ ప్రజలు బారులు తీరారు.