మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఐబి చౌరస్తా నుంచి మెటల్ కుంట వరకు జాతీయ రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైనట్టు జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ జోగినాథ్ గుప్తా తెలిపారు. అల్లాదుర్గంలో విలేకరులతో మాట్లాడుతూ.. అంత రాష్ట్ర రహదారి అల్లాదుర్గం మెటల్ కుంట వరకు 47 కిలోమీటర్లు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి పునర్ నిర్మించాలని ఇటీవల ఢిల్లీలో ప్రధాని కార్యాలయానికి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశామన్నారు.