డీప్ ఫేక్ వీడియోలను అరికట్టేందుకు కొత్త AI టూల్ ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో డీప్‌ఫేక్ ఫేస్‌తో పాటు వాయిస్‌ను కూడా సులభంగా గుర్తించవచ్చు. దీంతో డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడం ఆగిపోతుందని యూట్యూబ్ చెబుతోంది. AIతో వీడియోల్లో ఉన్న వారి ముఖం అసలైందేనా.? ఎడిట్ చేసిందా తెలుసుకోవచ్చు. ఇక సింథటిక్-సింగింగ్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో వాయిస్‌ను కూడా సులభంగా గుర్తించవచ్చు.