ఓసీఎం1లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఇంజనీర్స్ డే వేడుకలు
NEWS Sep 15,2024 06:50 pm
భారతరత్న గ్రహీత, ప్రఖ్యాత ఇంజనీర్, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని "ఇంజనీర్స్-డే" వేడుకలను ఓసీఎం-1 కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓసీఎం 1 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఆయన విశిష్టతను, కార్య దక్షతను, భారతదేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు.