100 కోట్ల క్లబ్‌లో నాని సినిమా!
NEWS Sep 15,2024 05:52 pm
దర్శకుడు వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను బద్దలు కొట్టి గొప్ప బాక్సాఫీస్ మైలురాయిని సాధించింది. సరిపోదా శనివారం దేశీయంగా, ఓవర్సీస్‌లో స్థిరమైన కలెక్షన్లను రాబడుతోంది. ఉత్తర అమెరికాలో 2.48 మిలియన్ల గ్రాస్‌తో జోన్‌లో 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. ‘దసరా’ 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నాని రెండో చిత్రంగా ‘సరిపోదా శనివారం’ నిలిచింది.