డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ
NEWS Sep 15,2024 05:44 pm
మల్యాల మండలంలోని వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక నిమజ్జనం ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. వినాయకులను నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఘటనలకు తావు లేకుండా వినాయక నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనం ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నరేష్ తెలిపారు.