అరకులోయ గిరిజన మ్యూజియంను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఆదివారం ఉదయం నుండి పర్యాటకుల రాక పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. వర్షాలు తగ్గడంతో పర్యటనలకు వాతావరణం అనుకూలంగా ఉండటం మరియు శనివారం, ఆదివారం, సోమవారం వరుస శెలవులతో పర్యాటకుల రాక పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. శని, ఆదివారాలలో మ్యూజియంను సుమారు 2000 మంది పర్యాటకులు సందర్శించారన్నారు.