కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.