జగిత్యాల పట్టణంలోని మంచి నీళ్ల బావి వీధిలో పేపర్ గణపతిని స్థానికుడు నారేల్లి ఓంకార్ అనే డిగ్రీ విద్యార్థి తయారుచేశాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. దాదాపు 5 రోజుల్లో గణపతిని తయారు చేసినట్లు తెలిపారు. వీధిలోని ప్రజలు విద్యార్థి ప్రతిభను మెచ్చుకొని పేపర్తో చేసిన విగ్రహానికి ప్రతేకపూజలు నిర్వహించారు. రేపు నిమజ్జనం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.