రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి మహాభిషేకం,శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. ఉదయం నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఆలయ ధర్మగుండంలో నిమజ్జనం చేస్తారు.