ఘనంగా వినాయక నిమజ్జనం
NEWS Sep 15,2024 05:21 pm
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక అశోక్ నగర్ లోనీ సెలెస్టియల్ హై స్కూల్లో కరస్పాండెంట్ బుర్ర రాధకృష్ణ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు చేసి రకరకాల పిండి వంటలతో నైవేద్యాన్ని పెట్టి, సెలెస్టియల్ పాఠశాల నుండి ఊరేగింపు శోభాయమానంగా బయలుదేరి విద్యార్థిని, విద్యార్థులు దారి పొడవునా భక్తి పాటలపై నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ మానేరు తీరానికి చేరి వినాయకున్ని నిమజ్జనం చేశారు.