సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ వీధి లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యములో తెలంగాణ సాంస్కృతిక సారథి ఎడమల శ్రీధర్ రెడ్డీ కళా బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. తడి పొడి హాని కలిగించే చెత్తలు వేరు చేసి మన ఇంటి ముందుకు వచ్చే మున్సిపాలిటీ వాహనానికి అందించాలని ఇంటిలో 3 బుట్టలు వాడుతూ చెత్తలను వేరు చేయాలని మన ఇంటిలో మన వాడలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్చ ధనం పచ్చదనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.