కేటీఆర్ వ్యాఖ్యలపై ఖండన
NEWS Sep 15,2024 05:26 pm
రాజన్న సిరిసిల్ల: ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడిన తీరుపై అభ్యంతరం చెప్పారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిన తీరును ఖండించడం పోయి, ఇలాంటి సీఎం దొరకడం తమ దురదృష్టకరమని అనడం సరైనది కాదన్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు పార్టీని మారుతుంటారని అందులో అనడానికి ఏం ఉండదని అన్నారు.