బస్సు బీభత్సం.. ఇద్దరు స్పాట్‌డెడ్
NEWS Sep 15,2024 01:32 pm
జగిత్యాల రూరల్ మండలం పోలస చౌరస్తా దగ్గర 2 టూ వీలర్స్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న తాత భైండ్ల లచ్చన్న, మనుమరాలు శ్రీనిధి ఇద్దరు స్పాట్స్ లోనే మృతి చెందారు. మనుమడికి తీవ్రగాయాలు అయ్యాయి. బస్సు ఓ బైక్ ను తొక్కుకుంటూ వెళ్ళడంతో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యయి. బస్సు డ్రైవర్ పరార్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.