పోలాస స్టేజీవద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి,ముగ్గురికి గాయాలు
NEWS Sep 15,2024 01:43 pm
జగిత్యాల జిల్లా ధర్మపురి జాతీయ రహదారి,జగిత్యాల రూరల్ మండలం పోలాస స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా 2 ద్విచక్ర వాహనాలను ఓ ప్రైవెట్ బస్సు ఢీకొనటంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు వృద్దుడు కాగా 13 సంవత్సరాల బాలిక ఉంది, మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరితో పాటు మరో బాలుడికి గాయాలయ్యాయి, వీరిని జగిత్యాల అసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహానాలపైనుండి బస్సు వెళ్లటంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి.