అన్నప్రసాద వితరణ కార్యక్రమం
NEWS Sep 15,2024 05:33 pm
జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు పోసానిపల్లి రోడ్డు వెళ్లే మార్గములో పవిత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన చేసిన వినాయక మండపంలో 16 ఫీట్ల భారీ గణనాధునికి గల్లి వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గల్లివాసులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నప్రసాద కార్యక్రమములో జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్, నాగరాజ్, TRS నాయకుడు కో ఆప్షన్ మెంబర్ ఫైజల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.