మాజీ ఎంపీపీ జంగం శ్రీను అరెస్ట్
NEWS Sep 15,2024 05:34 pm
నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలంలో రోడ్ ఫేస్ భూముల పేరుతో నిజాంసాగర్ ముంపు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి మోసం చేసిన ముఠాను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ముగ్గురు దళారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా నిందితులను కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పెద్ద శంకరంపేట్ మాజీ ఎంపీపీ జంగం శ్రీను, ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.