సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో విషాదం నెలకొంది. చిన్న ముబారక్ పూర్ కు చెందిన ఎర్రోళ్ల రాజు ఈనెల 9న అర్థరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 10న సిర్గాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బొక్కస్ గాం శివారులో ఓ వ్యక్తి చింత చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో రైతులు చూసి తప్పిపోయిన రాజుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు..