దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో చెరువులో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కొమురవెల్లి మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి అప్పనపల్లి తల్లిగారింటికి వచ్చింది. ఈరోజు తల్లి రేణుక, మరదలు కావ్య తో కలిసి నవీన, ఆమె కుమారుడు సాయి (7) చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న సాయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.