మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన
దేవినేని ఉమామహేశ్వర రావు
NEWS Sep 15,2024 10:02 am
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీనివాస నగర్ లో శ్రీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణనాధునికి TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు.