సింగూర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 1887 క్యూసెక్కులు..
NEWS Sep 15,2024 10:04 am
పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులో 1887 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నట్లు.. ఆదివారం సంబంధిత ఇరిగేషన్ AE మైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవెల్ 29,917 TMCలు కాగా, 29,469 TMC ల వద్ద జలాలు నిల్వ ఉందన్నారు. 3612 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. దీంట్లో జెన్కోకు 2363, స్పిల్ వే 848, ఆవిరి, HMWS, MB, తాలెల్మ కు 501 క్యూసెక్కుల విడుదల చేసినట్లు వివరించారు.