ఆర్సీపురం: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం సూర్తా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సిపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నిరసించి పోయిన ఇంటికి వచ్చి నిద్రించాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంభీకులు తెలిపారు.