ఫీజు బాధితులకు మనోజ్ మద్దతు
NEWS Sep 15,2024 09:57 am
తిరుపతి రూరల్ రంగంపేటలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలకు మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళన బాధ పెట్టిందని, వెంటనే ఈ విషయాన్ని తన తండ్రి మంచు మోహన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సందేశాలు ఉంటే mm.mbu0419@gmail.comకి మెయిల్ పంపాలని విజ్ఞప్తి చేశారు.