మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను
పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
NEWS Sep 15,2024 08:56 am
కరీంనగర్‌లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్ (స్థానిక సంస్థలు) , లక్ష్మి కిరణ్ ( రెవెన్యూ) , మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్, ఆర్డీవో, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.