గణనాథుడికి ఘనమైన పూజలు
NEWS Sep 15,2024 08:50 am
కరీంనగర్ 19వ డివిజన్ ఇంచార్జి పర్వతాల మల్లేశం ఆహ్వానం మేరకు రేకుర్తి సింహాద్రి కాలనిలోని ట్రెండ్జ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దీపారాధన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండపం వద్ద దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యూత్ అధ్యక్షులు గడ్డం రాజేష్, ప్రధాన కార్యదర్శి జాజాల మహేష్, కార్యవర్గ సభ్యులు గడ్డం నరేష్ సభ్యులు వేణు, గుంటి శివ కృష్ణా, మాచర్ల గణేష్ పాల్గొన్నారు.