మియాపూర్ భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..
NEWS Sep 15,2024 08:52 am
భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాల జిల్లా శ్రీశైలనీకి చెందిన రఫీకి అతడి భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె HYD మియాపూర్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. దీంతో రఫీ మనస్థాపం చెంది భార్య హాస్టల్ ముందు అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.