పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు
NEWS Sep 15,2024 08:57 am
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే ఈ ఆసుపత్రుల్లో సీబీసీ యంత్రాలు పనిచేయకపోవడం, కొన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండటం లేదని పేషెంట్స్ ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.