జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భయం వీడటం లేదు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు తప్పితే మిగతా విద్యార్థులు 5% మాత్రమే హాజరవుతున్నారు. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల పాము కాటుతో మృతి చెందారు. ఈ పాఠశాలను ఆధునికరించినా కూడా విద్యార్థులు తిరిగి రావడం లేదు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు మాత్రమే తరగతులకు వస్తున్నారు.