త్వరలో వేములవాడకు సీఎం రేవంత్
NEWS Sep 15,2024 09:00 am
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. త్వరలోనే రూ.50 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనుండగా భక్తుల కష్టాలు తీరనున్నాయి. ఆలయ విస్తరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులు తదితర విషయాలపై ఇప్పటికే శృంగేరి పీఠాధిపతులతో చర్చించారు. కాగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆలయానికి రానున్నట్లు చర్చ సాగుతోంది.