MLA ఇంటి వద్ద 200 మంది పోలీసులు
NEWS Sep 15,2024 07:22 am
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద మరోసారి భారీగా పోలీసులు మోహరించారు. 200 మంది పోలీసులు ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. అక్కడి సప్తగిరి కాలనీ మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఇంటిచుట్టూ ఈ విధమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.