దిల్లీ: 2 రోజుల్లో రాజీనామా చేస్తానని దిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని చెప్పారు. మళ్లీ ప్రజా తీర్పు కోరతానన్నారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుగుతానని.. తాను నిర్దోషినని నమ్మి తే ఓట్లు వేయాలని కోరారు. ఆప్ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.