తెలంగాణలో ఏళ్ల నిరీక్షణ తర్వాత మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు పూర్తయ్యాయి. 2013లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒకేదగ్గర పనిచేస్తున్న వారంతా శనివారం కొత్త స్థానాల్లో చేరారు. తమకు బదిలీలు నిర్వహించాలని టీచర్లు ఎన్నోసార్లు ఆందోళనలు చేశారు. 2023లో బదిలీలు చేపట్టినా హైకోర్టు స్టే ఇచ్చింది. సీనియారిటీ ఆధారంగా బదిలీల పాయింట్లు కల్పించాలని ఆదేశించడంతో విద్యాశాఖ గత రెండు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసింది.