బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి
మాజీ ఎంపీ బీబీ పాటిల్
NEWS Sep 15,2024 07:30 am
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బిజెపి పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జోగిపేట పట్టణంలో జరిగింది. బిజెపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో, ప్రజలతో సభ్యత్వ నమోదు నిర్వహించారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉందని, అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్న ప్రధాని మోడీ మనందరికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్, మానేయ నవీన్, ప్రభాత్, గోపి, నవీన్, వెంకటేశం, రవీంద్ర గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.