జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులోని గణ ఫ్రెండ్స్ యూత్ అధ్వర్యంలో అయోధ్య రామయ్య ఆకారంలో వినాయకుడిని ప్రతిష్టించారు. 3-4 రోజుల నుంచి భక్తులు విష జ్వరాలతో ఇంటికే పరిమితమయ్యారని, వారిని కోలుకునేలా దీవించయ్యా వినాయకా.. అంటూ ఏకంగా వినాయకుడికే వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని వారు వెంటనే కోలుకునే చూడాలని వినతి అందించి, ప్రత్యేక పూజలు చేశారు.