నేడు మిలాద్ ఉన్ నబీ వేడుకలు
NEWS Sep 15,2024 06:00 am
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ జామ మస్జిద్ లో ఆదివారం రాత్రి మిలాద్ ఉన్ నబీ నబి మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ హమీద్, కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాత్రి 9 గంటలకు నమాజ్, అనంతరం నయ్యర్ ఆజం ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.