దేవీపట్నంలో తగ్గని వరద..
నీటిలోనే అమ్మవారి ఆలయం
NEWS Sep 15,2024 05:56 am
దేవీపట్నం మండలంలో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం ఇప్పటికీ వరద నీటిలోనే ఉందని, అమ్మవారి దర్శనాలకు భక్తులు రావద్దని ఆలయ ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. మరోవైపు రావిలంక, దండంగి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తుందని అటుగా వెళ్లొద్దని హెచ్చరించారు.